పరీక్షలపై భయం వద్దు: కలెక్టర్ సత్య శారద

పరీక్షలపై భయం వద్దు: కలెక్టర్ సత్య శారద

WGL: వర్ధన్నపేట పట్టణంలోని బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే విజయాన్ని సాధించవచ్చని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలనతో చదువుకోవాలని, ఒత్తిడికి లోనుకాకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని తెలిపారు. హాస్టల్ సౌకర్యాలను పరిశీలించారు.