VIDEO: ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న MP
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని శనివారం రాజంపేట MLA అమర్నాథ్ రెడ్డి, మాజీ MLA కొరముట్ల శ్రీనివాసులతో కలిసి రాజంపేట MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ రంగ మండపంలో సేదతీరి, స్వామి వారి ప్రసాదం స్వీకరించారు. వీరిని ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు.