రైస్ మిల్లు ఊకతో విద్యార్థులకు అవస్థలు

W.G: రైస్ మిల్లులో నుంచి వెలువడే ఊక కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తణుకు మండలం వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోడ ఆనుకుని ఉన్న రైస్ మిల్లు ద్వారా వెలువడుతున్న ఊకతో పాటు పొగ గొట్టం ద్వారా వస్తున్న ధూళి కారణంగా విద్యార్థులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి కళ్ళల్లో పడడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు.