నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: బొబ్బిలి పట్టణంలో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న కారణంగా ఇవాళ ఉదయం 10 నుంచి 1.30 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని EE రఘు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు చర్చిసెంటర్, పోర్ట్ ఏరియా, కోరాడవీధి, బెండావీధి, దావాలవీధి, బలిబిపీటరోడ్, రత్నాలనగర్, సిరిపురపువీధి పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.