శ్రీలంకపై భారత్‌ గెలుపు

శ్రీలంకపై భారత్‌ గెలుపు

తొలి మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 13.3 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటైంది. ఏడుగురు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. దీపిక (26), అనేక్ష దేవి (15) జట్టుకు విజయాన్ని అందించారు.