VIDEO: పీయూలో 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమం
MBNR: ప్రజా పాలనలో భాగంగా పాలమూరు యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగం యూనిట్ - I ఆధ్వర్యంలో శనివారం పీజీ కళాశాల ఆవరణలో 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా ఎం కృష్ణయ్య పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ S. రవికుమార్, అధ్యాపకులు, వాలంటీర్స్ పాల్గొన్నారు.