కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

BDK: పాల్వంచ మండలం రెడ్డిగూడెంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అధికారులతో కలిసి పరిశీలించారు. తేమలేని నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.