పంచాయతీ కార్యదర్శులకు GOOD NEWS
TG: ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా 1,037 మంది అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు మరో ఏడాది పాటు వారి బాధ్యతలు కొనసాగించనున్నారు. వారికి నెలకు రూ.19,500 వేతనం చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.