ఉత్సాహంగా నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ స్టడీ సర్వే

ఉత్సాహంగా నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ స్టడీ సర్వే

ADB: గాదిగూడ మండలంలో నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ స్టడీ సర్వే ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈమేరకు సోమ,మంగళవారాల్లో గాదిగూడ మండలం దాబా (బి) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల సామర్థ్యాలను నేరుగా ట్యాబ్‌లలోనే నమోదు చేయడం ఈ సర్వే ప్రత్యేకత. డైట్ చాత్రోపాధ్యాయులు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరించారు.