వైభవంగా పోలేరమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు
NLR: మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఐదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారము అర్చకులు శ్రీనివాసులు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ మండపారాధన, నవావరణ పూజ, పంచామృతాలతో సుగంధద్రవ్యాల పోలేరమ్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా నాగేంద్ర, అనురాధ దంపతులు వ్యవహరించారు.