ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

SRCL కోనరావుపేట మండలంలోని ఏబీవీపీ నాయకులను మంగళవారం కోనరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు పూజిం కార్తీక్ మాట్లాడుతూ.. రాష్ట్ర నాయకత్వం ఎలాంటి పిలుపు లేకపోయినప్పటికీ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారని అన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఏబీవీపీ నాయకుడు ఇట్టిరెడ్డి గణేష్ రెడ్డి ఉన్నారు.