యనమలకుదురులో ప్రారంభమైన గ్రామప్రభ

యనమలకుదురులో ప్రారంభమైన గ్రామప్రభ

కృష్ణా: కోటప్పకొండలో ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో ప్రసిద్ధిగాంచిన యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గ్రామ ప్రభను ప్రత్యేక పూజలతో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.