యోగి వేమారెడ్డి విగ్రహానికి స్థలం కేటాయించిన మంత్రి

యోగి వేమారెడ్డి విగ్రహానికి స్థలం కేటాయించిన మంత్రి

సత్యసాయి: గోరంట్ల పట్టణ కేంద్రంలో యోగి వేమారెడ్డి విగ్రహం ప్రతిష్టాపన కోసం స్థలం కావాలని మంత్రి సవితను గత కొన్నిరోజుల క్రితం కోరారు. మంత్రి సవిత అధికారులతో మాట్లాడి విగ్రహ ఏర్పాటు కోసం స్థలం మంజూరు చేయించారు. శుక్రవారం పెనుకొండలోని మంత్రి కార్యాలయంలో స్థలం యొక్క పట్టా పత్రాలను గోరంట్ల రెడ్డి సంగం నాయకులకు మంత్రి అందజేశారు.