ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారి
Jgl: ధర్మపురి మండలం చిన్నాపూర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో నమోదు చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆమె ఆదేశించారు. అధికారులు అలసత్వం వహించకూడదని సూచించారు.