నేడు లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ

MBNR: భూ భారతి చట్టం అమలులో భాగంగా నియమించనున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు నేడు MBNRలో జడ్పీ సమావేశ మందిరంలో శిక్షణా కార్యక్రమం ఉంటుందని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ విజయేందిర బోయి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణకు లైసెన్స్డ్ సర్వేయర్లు ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలని సూచించారు.