జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర?

జమ్మూకశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. జైళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైళ్లపై దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ జైళ్లలో కీలక ఉగ్రవాదులు, స్లీపర్ సెల్ సభ్యులున్నారు. వీరు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినట్లు ఆరోపణలున్నాయి.