బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

NRML: తానూర్ మండలం బోసి గ్రామంలో బాల్య వివాహం జరగబోతున్న సమాచారం అందుకున్న బాలల పరిరక్షణ శాఖ అధికారులు మంగళవారం వివాహాన్ని అడ్డుకున్నారు. 14 ఏళ్ల మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందటంతో ముధోల్ సీఐ మల్లేష్, సిడిపిఓ సరోజిని, నాగలక్ష్మి తదితరులు అక్కడికి చేరుకొని వివాహాన్ని నిలిపివేసి ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు