లారీని ఢీకొన్న బస్సు.. ఒకరి మృతి

NLR: ట్రావెల్ బస్సు లారీని ఢీకొనడంతో ప్రయణికుడు సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా పలువురుకి గాయాలైన ఘటన గుడ్లూరు మండలం జాతీయ రహదారిపై తెట్టు ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం జరిగింది. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెట్టు ప్లై ఓవర్ బ్రిడ్జిఫై లారీని వెనుక నుంచి ఢీకొంది. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.