సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష
తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2020లో నమోదైన లాకప్ డెత్ కేసులో 9 మంది తమిళ పోలీసులకు మరణ శిక్షను విధించింది. ఓ కేసు విచారణ నిమిత్తం తండ్రి కొడుకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిని విచారిస్తున్న సమయంలో కస్టడీలోనే తండ్రి కొడుకులు మరణించారు. దీనిపై కేసు నమోదు చేయగా విచారించిన కోర్టు నిందితులకు మరణ శిక్షను ఖరారు చేసింది.