నేటి నుంచి మూడు రోజులు ముత్యాలమ్మ తిరుణాలు

నేటి నుంచి మూడు రోజులు ముత్యాలమ్మ తిరుణాలు

CTR: ములకలచెరువు మండలంలోని బురకాయలకోటలో ముత్యాలమ్మ తిరుణాల శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు. శనివారం ఆలయంలో ఆలయ శుద్ధి, గోపూజ, గణపతిపూజ, ఆదివారం మహా అభిషేకం నిర్వహించనున్నారు. సోమవారం పారాయణం, కుంకుమార్చన, మహా మంగళహారతితో తిరుణాల ముగుస్తుందన్నారు.