VIDEO: సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం
NLG: నిన్నటి కేతుగ్రస్త చంద్రగ్రహణం ముగియడంతో, నేడు ఉదయం శ్రీ యల్లమ్మ అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృత అభిషేకం, మహా మంగళ నీరజనం సమర్పించారు. ఆలయ శుద్ధి తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముఖ్య అర్చకులు నాగోజు మల్లా చారి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, అమ్మవారి ఆశీస్సులు అందించారు.