VIDEO: పలు సమస్యలపై మంత్రికి సీపీఎం వినతి

VIDEO: పలు సమస్యలపై మంత్రికి సీపీఎం వినతి

E.G: నిడదవోలులో రైతు బజార్ ఏర్పాటు చేయాలని మంత్రి కందుల దుర్గేష్‌కు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు సోమవారం సాయంత్రం వినతి పత్రం అందించారు. అలాగే 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరల్ ఫిజిషియన్ ఏర్పాటు చేయాలని, జనరల్ సర్జన్ ఫార్మాసిస్ట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.