రంజన్ల కొనుగోళ్లపై ప్రజల ఆసక్తి
KNR: వేసవి తీవ్రత పెరగడంతో చల్లని నీళ్లు తాగేందుకు వినియోగించే రంజన్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో మట్టి రంజన్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఫ్రిజ్ నీళ్లకంటే రంజన్ నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. చిరు వ్యాపారులు, దుకాణాల సముదాయాలు, ఇళ్లలో వాడేందుకు రంజన్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.