అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
NRPT: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్సై రాముడు హెచ్చరించారు. గురువారం నారాయణపేట మండలం కోటకొండకు ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. ఇసుకను తరలిస్తున్న కావాలి నరేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.