నందికొట్కూరు ఖాజీగా నియమితమైన సైఫుల్లా

నందికొట్కూరు ఖాజీగా నియమితమైన సైఫుల్లా

NDL: నందికొట్కూరు పట్టణం, రూరల్ ఖాజీగా హజ్రత్ మౌలానా మహమ్మద్ సైఫుల్లా రషాదిను కూటమి ప్రభుత్వం నియమించింది. మంగళవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య చేతుల మీదుగా నియామక ధృవపత్రం అందజేశారు. ఆయన నియామకం పట్ల మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూలమాల వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీలు, తదితరులు పాల్గొన్నారు.