'ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలి'
అన్నమయ్య: రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రమాదాల కారణాలు, రోడ్డు భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు.