VIDEO: కంభంలో జనసేన నాయకుల విస్తృత స్థాయి సమావేశం
ప్రకాశం: కంభంలో జనసేన నాయకుల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం వాడివేడిగా జరిగింది. పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల కేటాయింపు వంటి అంశాలపై నాయకులు చర్చించారు. అయితే జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు హాజరు కాకపోవడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ని చూడడమే తమ లక్ష్యమని కార్యకర్తలు పేర్కొన్నారు.