ఈనెల 19న మండల కార్యాలయాల్లో వినతి పత్రం అందజేత

ఈనెల 19న మండల కార్యాలయాల్లో వినతి పత్రం అందజేత

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా రహదారులు దెబ్బతిని అద్వాన స్థితికి చేరుకున్నాయని జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ఆరోపించారు. ఈ  నేపథ్యంలో ఈ నెల 19న అన్ని మండల కార్యాలయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన మణుగూరులో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమ ప్రాంతాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.