మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ కట్

మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ కట్
కృష్ణా: పెడన మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు సోమవారం విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. రూ.10.28 లక్షల విద్యుత్ బకాయిలు ఉండడంతో విద్యుత్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనితో కార్యాలయంలో పరిపాలన సేవలకు అంతరాయం ఏర్పడింది. కమిషనర్ విజ్ఞప్తి మేరకు విద్యుత్ శాఖ అధికారులు కొన్ని రోజుల సమయం ఇచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.