ఉచ్చిలి గ్రామంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

ఉచ్చిలి గ్రామంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

కోనసీమ: ఆత్రేయపురం మండలం ఉచ్చిలిలో రైతన్న మీకోసం కార్యక్రమం టీడీపీ శ్రేణులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బండారు సంజీవ్ పాల్గొన్నారు. రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి రైతన్న మీకోసం పాంప్లెట్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఖాతాలో రూ.20,000 జమ చేసినట్లు పేర్కొన్నారు.