గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి
విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాళ్లు, శకటాలు సిద్ధం చేయగా, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి.