గిరిజన డీఈడీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గిరిజన డీఈడీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

BDK: భద్రాచలం గిరిజన డి.ఎల్.ఈ.డి కళాశాలలో 2026-28 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ దరఖాస్తులు కోరారు. ఇంటర్‌లో 45% మార్కులు సాధించిన ఏజెన్సీ గిరిజన అభ్యర్థులు అర్హులు అని తెలిపారు. మెరిట్ ప్రాతిపదికన 50 సీట్లు భర్తీ చేస్తారని చెప్పారు. ఆసక్తి గల వారు ఐటీడీఏ కార్యాలయాల్లో ఉచితంగా దరఖాస్తులు పొంది, మే 11వ తేదీలోపు సమర్పించాలి అని ఆయన పేర్కొన్నారు.