ఇందిరమ్మ ఇళ్లు పరిశీలించిన ఎంపీడీవో
NLG: శాలిగౌరారం మండలం చింతలూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీవో గార్లపాటి జ్యోతి లక్ష్మీ బుధవారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నాణ్యతకు సంబంధించిన వివరాలను స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకన్నను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆమె సూచించారు.