శరవేగంగా గుణదల మేరీ మాత చర్చ్ పనులు
NTR: విజయవాడలోని గుణదల మేరీ మాత నూతన దేవాలయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం చర్చి పనులను బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చర్చి నిర్మాణం విషయంలో పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్‌లో చర్చ్ ఓపెనింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.