ఫిర్యాదుల కమిటీ ఛైర్పర్సన్‌గా డా. కృష్ణకుమారి
ASR: జిల్లాలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు POSH చట్టం 2013 కింద ప్రభుత్వం ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసింది. 2026-29 కాలపరిమితి గల ఈ కమిటీకి ఛైర్ పర్సన్‌గా అరకులోయ కేజీబీవీ పాఠశాల CRT, సోషల్ వర్కర్‌డా కంబిడి కృష్ణకుమారిని నియమించారు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు ఉంటే కమిటీ కి తెలపాలని శుక్రవారం కమిటీ ఛైర్పర్సన్ పేర్కొన్నారు.