ఏటా 6000కు పైగా పెరుగుతున్న కుక్క కాటు కేసులు.!

ఏటా 6000కు పైగా పెరుగుతున్న కుక్క కాటు కేసులు.!

HYD: ప్రతి సంవత్సరం గ్రేటర్ HYD నగరంలో కుక్కకాటు కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏటా కనీసం 5 వేల నుంచి 6 వేల వరకు కేసులు అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణ, టీకాల కార్యక్రమాలు సక్రమంగా అమలు కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.