'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

KMRD: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివిధ లోన్ యాప్ల ద్వారా చరవాణిలకు వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజంపేట్ ఎస్సై పుష్పరాజ్ ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో పోలీస్ కళాబృందం వారిచే సోమవారం రాత్రి కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.