సింగరేణి విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా వెంకటయ్య
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమావేశం సోమవారం నిర్వహించారు. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ప్రాంతాలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సమావేశానికి శ్రమ శక్తి అవార్డు గ్రహీత పెట్టం లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా గజ్జెల్లి వెంకటయ్య ఎన్నికయ్యారు.