'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

MDK: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేగోడ్ మండల వైద్యాధికారి డాక్టర్ వికాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు ఎక్కడా నిల్వ కాకుండా చూడాలని, అలసట లేదా జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.