VIDEO: రాజమండ్రిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

VIDEO: రాజమండ్రిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

E.G: రాజమండ్రి శాటిలైట్ సిటీలో అక్రమంగా నిల్వ ఉంచిన 1420 కేజీల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఓ సిమెంట్ తూరల షెడ్డు సమీపంలో నిల్వ ఉంచగా, రూరల్ డీటీ ప్రభాకర్, రాజానగరం డీటీ బాపిరాజు దాడులు నిర్వహించారు. మొత్తం 30 బస్తాల బియ్యాన్ని సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.