ఉత్తమ రైతు అవార్డు అందుకున్న వంగల వెంకటరెడ్డి
KNR: హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన రైతు వంగల వెంకట్ రెడ్డి కి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు దక్కింది. గడిచిన 35 సంవత్సరాలుగా వరి మొక్కజొన్న వంగడాలను పండించిన వెంకట్ రెడ్డి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించికొని వ్యవసాయంచేస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా తోటి రైతులకు సహాయ సహకారాలు చేస్తూ దిగుబడి పొందేలా చర్యలు తీసుకున్నారు.