ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తిరుపతి నగరంలోని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కార్యాలయం వద్ద శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిందని తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.