బీటీ ప్రాజెక్టుకు భారీగా వరద
ATP: గుమ్మగట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి 1800 క్యూసెక్కుల నీటి ప్రవాహం వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సమాచారం 1655 అడుగులు కాగా ప్రస్తుతం 1652.5 అడుగుల మేర నీరు చేరిందన్నారు. భారీ వరద వస్తున్న నేపథ్యంలో రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు జల వనరుల శాఖ ఏఈ హరీష్ శనివారం తెలిపారు.