'జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి'
నంద్యాల: జిల్లా వ్యాప్తంగా 5,537 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ హరి గోపాల్ వెల్లడించారు. శుక్రవారం చాగలమర్రి మండలం చాకరాజువేముల గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 32,087 ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఉగాది లోపు మిగిలిన ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.