VIDEO: వరి పంటను ధ్వంసం చేసిన పందులు
MNCL: చెన్నూరు మండలం గంగారంలో చేతికి వచ్చిన పంటను పందులు ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన నగేష్ రైతు 3 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి అడవి పందులు వరి పంటను కొరికి ధ్వంసం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంబంధిత అధికారులు సర్వే చేపట్టి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.