గృహ వినియోగదారులకు కేంద్రం GOOD NEWS
దేశంలో LPG సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్ కొరత భయంతో చాలామంది అనవసరంగా బుకింగ్స్ చేస్తున్నారని, ఆందోళన చెందవద్దని కోరింది. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నామని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని కేంద్రం తెలిపింది.