కార్తీ కొత్త మూవీ.. ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో కార్తీతో దర్శకుడు నలన్ కుమార్ స్వామి తెరకెక్కించిన సినిమా 'వా వాతియర్'( తెలుగులో 'అన్నగారు వస్తారు'). మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీని ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతుంది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి, సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.