పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్
KMM: మధిర మండలం రాయపట్నం ఏటి వద్ద నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై టౌన్ పోలీసులు దాడి చేశారు. పది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 5,500 నగదు, 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ డి.రమేష్ హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.