గద్వాలలో ఏప్రిల్ 26 నుంచి స్వీయ లెక్కింపు

గద్వాలలో ఏప్రిల్ 26 నుంచి స్వీయ లెక్కింపు

GDWL: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జనగణన 2027తొలి దశలో భాగంగా గృహాల లెక్కింపునకు ప్రజలకు స్వీయ లెక్కింపు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.