ఆసుపత్రిలో ఆధునిక CD4 ల్యాబ్ ప్రారంభం
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డయాగ్నొస్టిక్ విభాగంలో అత్యాధునిక CD4 ల్యాబ్‌ను సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేయడంలో CD4 పరీక్ష కీలకమని తెలిపారు. తక్కువ సమయంలో రిపోర్టులు అందించి చికిత్స వేగవంతం చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.